గుంటూరు పోలీసు కవాతు మైదానంలో రేపు నిర్వహించే 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాటు చేసినట్లు గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ గంగాధరం తెలిపారు. కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అయన వివరించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్రాజు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్, గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఈ నెల 27 వరకు మూడు రాజధానులపై స్టేటస్‌కో'