ETV Bharat / state

గణతంత్ర స్ఫూర్తిని చాటేలా ఘనంగా వేడుకలు జరపాలి: తెలంగాణ హైకోర్టు - గణతంత్ర వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు

High Court on Republic Day Celebrations: గణతంత్ర వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిపబ్లిక్‌ డే వేళ పరేడ్‌ నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్​కు చెందిన శ్రీనివాస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్​పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని స్పష్టం చేసింది.

High court
హైకోర్టు
author img

By

Published : Jan 25, 2023, 8:03 PM IST

High Court on Republic Day Celebrations: గణతంత్ర వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిపబ్లిక్‌ డే వేళ పరేడ్‌ నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్​కు చెందిన శ్రీనివాస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్​పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని స్పష్టం చేసింది. గణతంత్ర దినోత్సవాలకు ప్రజలను అనుమతించాలని సూచించింది. కరోనా ప్రభావం ఉన్నందున జరపడం లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.

దీనిపై వాదనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకి వివరణ ఇచ్చారు. ఈనెల 13వ తేదీనే రాజ్‌భవన్‌కు లేఖ రాశామని.. రాష్ట్రంలో కొవిడ్‌ ఉన్నందున రాజ్‌భవన్‌లోనే వేడుకలు జరుపుకోవాలని కోరినట్లు కోర్టుకు తెలిపారు. రాజ్ భవన్‌లో వేడుకలకు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని ఏజీ తెలిపారు. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలను ప్రజలు చూసేందుకు వెబ్‌ కాస్టింగ్‌ చేస్తామని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం.. గణతంత్ర దినోత్సవాల నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 19న ఇచ్చిన మార్గదర్శకాలన్నింటినీ పాటించాలని ఆదేశించింది.

ప్రభుత్వం చెబుతున్నట్లు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నట్లయితే.. కొవిడ్‌ ఆంక్షలు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించింది. కాబట్టి వీటన్నింటిని తాము పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. గణతంత్ర దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన జాతీయ పండగ అని.. దేశభక్తిని చాటిచెప్పే పండగ అని వ్యాఖ్యానించింది. గణతంత్ర స్ఫూర్తిని చాటేలా ఘనంగా వేడుకలు జరపాలన్న హైకోర్టు... పరేడ్‌ కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో మాదిరిగా గణతంత్ర వేడుకలు జరిపేలా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గణతంత్ర వేడుకలను రద్దు చేయడం అప్రజాస్వామికం: రాష్ట్ర ప్రభుత్వం ఏటా పరేడ్ మైదానంలో నిర్వహించే గణతంత్ర వేడుకలను రద్దు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్దంగా గవర్నర్ తన విధులు నిర్వహించకుండా కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్రలో భాగమేనని అయన మండిపడ్డారు. రాష్ట్రంలో గవర్నర్‌కు దక్కాల్సిన ప్రోటోకాల్‌ను పాటించడం లేదని బండి సంజయ్ దుయ్యబట్టారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించడం లేదంటే మహిళలంటే కేసీఆర్‌కు చిన్నచూపు అని పేర్కొన్నారు. రాజ్యాంగపరంగా ఉన్నత పదవిలో ఉన్న గవర్నర్‌నే గౌరవించడం చేతగాని కేసీఆర్ మహిళలకు ఏ విధంగా పెద్దపీట వేస్తారో... వారికి 35 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలు ఆలోచించాలని సంజయ్ కోరారు.

కేసీఆర్‌ను జోకర్‌లా చూస్తున్నారు: కరోనా సాకు చూపి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించలేమని చెప్పడం చూసి జనం నవ్వుకుంటున్నారని... కేసీఆర్‌ను జోకర్‌లా చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు నిర్వహించే బహిరంగ సభలకు అడ్డురాని కరోనా నిబంధనలు గణతంత్ర వేడుకలకు వర్తింపజేయడం సిగ్గు చేటు అన్నారు. ప్రజాస్వామ్యంపైనా, రాజ్యాంగంపైనా కేసీఆర్‌కు ఏమాత్రం నమ్మకం లేదని రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలనడం అందులో భాగమేనని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలను పిలిపించుకుని గవర్నర్ వ్యవస్థను కించపర్చేలా మాట్లాడిస్తున్నారని బండి సంజయ్ అగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.