ETV Bharat / state

కరోనా నుంచి మనం నేర్చుకోవాల్సింది?

కరోనా వైరస్... ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అటువంటి వైరస్​ను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? వైరస్​లు మన శరీరంపై దాడి చేయటానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలని ఉందా?

corona eradication methods from school stage
కరోనా
author img

By

Published : May 31, 2020, 12:17 PM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్​కు ఇంకా మందు రాలేదు. వ్యాక్సిన్ తయారీ ప్రయోగ దశలోనే ఉంది. ఇప్పటికే ఎంతో మందిని పొట్టనపెట్టుకుందీ మహమ్మారి.

ప్రస్తుతం మన ముందున్న మార్గమేంటి. మందు ఎపుడు కనుగొంటారు... టీకా తయారీ ఎప్పటికి పూర్తవుతుంది. వీటికి వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. కానీ ఒక్క విషయంలో మాత్రం అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఏ వైరస్ దగ్గరకు రాదని చెప్తున్నారు. అందుకే ఎలాంటి క్రిములనైనా తట్టుకునేలా మన శరీరాన్ని సిద్ధం చేసుకోవటం ద్వారా కరోనానే కాదు... భవిష్యత్తులో వచ్చే వైరస్​ల బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

వారంటే వైరస్​లకూ హడలే...

కరోనా ప్రపంచాన్ని భయపెట్టినంతగా..మరే వ్యాధీ భయపెట్టలేదు. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావిత దేశాల్లో గుర్తించిన అంశం ఏమిటంటే ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉందో వారే ఈ వైరస్ బారిన పడుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్న వారిని వైరస్​లు అంత త్వరగా దరిచేరవు. ఒకవేళ వ్యాధులు, వైరస్‌లు సోకినా వారు త్వరగా కోలుకుంటారు. కరోనా లాంటి వైరస్ సైతం వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్నవారికి సోకటం లేదు. ఒకవేళ వచ్చినా కొద్ది రోజుల్లోనే వారు కోలుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.

మనదేశం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే...

corona eradication methods from school stage
పోషకాహారం

అధిక జనాభా ఉన్న మన దేశంలో నివారణ చర్యలే చాలా కీలకం. అందులోనూ రోగ నిరోధక శక్తి పెంచటం అంటే కేవలం మన ఆహారం, జీవనశైలిలో మార్పులు చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మెనూలో మంచి ఆహారం ఉండేలా చూడాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచే కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, గుడ్లు, మాంసం వంటి వాటి మేళవింపుగా మెనూ రూపొందించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది దాదాపు పేద వర్గాల వారే. పోషకాహార లోపం ఎక్కువ ఉన్న బాలలు కూడా వారే. తద్వారా త్వరగా అంటు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు చక్కటి ఆట స్థలం తప్పకుండా ఉంటుంది. ఆట స్థలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి పాఠశాల కమిటీ చర్యలు తీసుకోవాలి.

ప్రధాని మోది, కేంద్రప్రభుత్వం చెప్పిందివే...

ప్రధాని మోదీ చెప్పినట్టు పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాల డెయిరీ రైతులను ప్రోత్సహించటానికి ఇదో అవకాశం కూడా. అలాగే గోరు వెచ్చటి నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. తులసి, ఉల్లి, వెల్లుల్లి వంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మొక్కలను పాఠశాల ఆవరణలోనే పెంచాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచన. పుదీనా, తోటకూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు వంటి అనేక మొక్కలను పెంచి వాటిని మధ్యాహ్న భోజనంలో వినియోగించాలి.

మన రాష్ట్రంలో పరిస్థితి ఇదీ....

వాటర్ బెల్ ప్రయోగం

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 70 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో 38లక్షలు, ప్రైవేటు పాఠశాలల్లో 32 లక్షల మంది ఉన్నారు. వీరిలో రోగనిరోధక శక్తి పెంచే కార్యక్రమం చిన్ననాటినుంచి చేపట్టాలి. అందులో పాఠశాలలు, తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వాలపైనా ఉంది. జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉంచాలి. పౌష్టికాహారం అందించాలి. దాని ప్రాధాన్యాతను వివరించాల్సిన అవసరం ఉంది. అపుడు పిల్లలు ఫాస్ట్ ఫుడ్​కు దూరంగా ఉండి సంప్రదాయ ఆహార అలవాట్లు, రోగనిరోధక శక్తి పెంచే తిండివైపు మొగ్గు చూపిస్తారు. భవిష్యత్తులో వ్యాధులు లేని ఆరోగ్యభారతాన్ని చూడాలంటే అందుకు బాల్యం నుంచే పునాదులు పడాలి.

'ఆహారంతో పాటు సరిపడా మంచినీరు తరచుగా తాగే అలవాటు చేయాలి. కేరళలో మంచి ఫలితాలు ఇచ్చిన వాటర్ బెల్ వంటి ప్రయోగం అన్నిచోట్లా అమలు కావాలి. ప్రతి పాఠశాలలో విద్యార్థినులకు తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండాలి. చాలామంది మంచినీరు తాగితే మూత్రశాలకు వెళ్లాల్సి వస్తుందని నీరు తాగకుండా ఉంటారు. అది వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

ఇక తప్పనిసరిగా పిల్లలను ఆటలు ఆడించాలి. ఎండలో కాసేపు ఉండటం ద్వారా వారిలో డి విటమిన్ పెరిగేందుకు దోహదం చేస్తుంది. ప్రభుత్వం, పాఠశాలతో పాటు తల్లిదండ్రులు కూడా పిల్లలకు దగ్గరగా ఉండాలి. అపుడు వారి మధ్య అనుబంధం పెరిగి మంచి ఆలోచనలతో, ఆరోగ్యంతో ఉంటారు.' -కెఎస్ లక్ష్మణరావు, శాసనమండలి సభ్యులు, విద్యారంగ నిపుణులు.

'1980లలోనే మన రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్ని ఎంపిక చేసి బలమైన పౌష్టికాహారం అందించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేశారు. అప్పట్లో అది మంచి ఫలితాలనిచ్చింది. ఇపుడు కూడా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులు చేయటంతో పాటు దాన్ని పూర్తిస్థాయిలో వ్యవస్థీకరించాలి. ఉదయం పాలు, సాయంత్రం కోడిగుడ్డు, చిక్కీలు వంటివి అందించాలి. అపుడు మంచి ఆహారం అందించినట్లవుతుంది. ఉదయాన్నే ఆసనాలు వేసేలా చర్యలు తీసుకోవాలి. అది వారి శారీరక ధారుఢ్యాన్ని పెంపొందిస్తుంది.' -రామకృష్ణ, మున్సిపల్ టీచర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు.

ఇదీ చదవండి: 'బాధ్యత కాదంటే కుదరదు.. కొత్త ఎల్​ఈడీ టీవీ ఇవ్వాల్సిందే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.