కోళ్ల ఫారంలో అక్రమ మద్యం నిల్వలు.. యజమానిపై కేసు నమోదు - గుంటూరు ఎక్సైజ్ అధికారుల దాడులు తాజా వార్తలు
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం చింతలపాలెం వద్ద కోళ్ల ఫారంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచారనే సమాచారంతో కోళ్ల ఫారంపై దాడులు నిర్వహించారు. కర్ణాటకకు చెందిన 2,880 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కోళ్ల ఫారం యజమాని కడియం కోటి సుబ్బారావు, మరో వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టుబడ్డ అక్రమ మద్యం విలువ మూడు లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
కోళ్ల ఫారంలో అక్రమ మద్యం నిల్వలు
ఇవీ చూడండి:
TAGGED:
కర్ణాటక మద్యం తాజా వార్తలు