ETV Bharat / state

కోటప్పకొండను కొల్లగొట్టిన అక్రమార్కులు - నరసరావుపేటలో అక్రమ తవ్వకాలు న్యూస్

గుంటూరులోని నరసరావుపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటవుతుందని ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున వెంచర్లు వేస్తున్నారు. అందుకు అవసరమైన రహదారుల నిర్మాణం, లోతట్టు ప్రాంతాల చదును కోసం.. కొంతమంది అక్రమదారులు కోటప్పకొండ వద్ద యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. అనుమతి లేకుండా చేస్తున్న ఈ వ్యవహారంపై.. అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Illegal excavations in Narasaraopet, Guntur district
కోటప్పకొండను కొల్లగొట్టిన అక్రమార్కులు
author img

By

Published : Feb 21, 2021, 3:24 PM IST

తనకు రావాల్సిన వాటా తనకిచ్చేస్తే ఎంతైనా తవ్వుకోవచ్చని అధికార పార్టీ నేత ఒకరు అక్రమార్జనకు తెరలేపారు. ఈ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకొని కొందరు అడ్డగోలుగా మట్టి తవ్వకాలు మొదలుపెట్టారు. గుంటూరు జిల్లా వెరసి కోటప్పకొండ సమీపంలోని శంభులింగం చెరువు అక్రమార్కులకు రూ.కోట్లు కురిపిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు.. కాసులే పరమావధిగా మరికొందరు కలిసి స్వార్థంతో కొండల్ని పిండి చేస్తున్నారు. అనుమతి లేకుండా చేస్తున్న తవ్వకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తినా తవ్వకాలకు ఏ మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

ప్రతిరోజూ 500 ట్రిప్పులు..

నరసరావుపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటవుతుందని ప్రచారం చేస్తూ పెద్దఎత్తున వెంచర్లు వేస్తున్నారు. వెంచర్లలో రహదారుల నిర్మాణం, లోతట్టు ప్రాంతాలు చదును చేయడానికి లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి అవసరమవుతోంది. ఈ కారణంగా.. కోటప్పకొండ సమీపంలోని శంభులింగం చెరువు వద్ద అక్రమంగా తవ్వకాలు మొదలుపెట్టారు. రాత్రి వేళ వందకుపైగా లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. సగటున ప్రతిరోజూ 500 ట్రిప్పుల మట్టి తరలిపోతోంది. అక్రమ తరలింపు వ్యవహారం మొత్తం పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి లారీ మట్టికి నియోజకవర్గ నేత ఒకరు రూ.1500 చొప్పున కప్పం వసూలుచేస్తున్నారు. అంతేకాకుండా సదరు నేత వంద ఎకరాలకుపైగా ఒక వెంచరు వేసి ఇళ్లస్థలాలు విక్రయిస్తున్నారు. వెంచరు మొత్తానికి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారు.

కొండ వద్ద తవ్వకాలకు అనుమతులు తీసుకోకపోయినా రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అటువైపు వెళ్లలేని పరిస్థితి. అధికారులు అటువైపు వెళితే నేత నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో సబ్‌కలెక్టర్‌, మైనింగ్‌ అధికారులు రెండుసార్లు ఆకస్మిక తనిఖీలు చేసి రూ.20లక్షల వరకు జరిమానా విధించి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ అక్రమ తవ్వకాలు నిరాంటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో కొత్తగా వెలుస్తున్న వెంచర్ల వల్ల మట్టికి విపరీతమైన డిమాండ్‌ ఉంటోంది. నియోజకవర్గ నేత ఒకరు అధికార యంత్రాంగం నుంచి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నందుకు పెద్దఎత్తున లబ్ధిపొందుతున్నారు. సదరు నేత అనుమతి లేకుండా సొంత వర్గం వారయినా మట్టి తవ్వి తరలిస్తే వెంటనే అధికారులు వచ్చి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజలకు మట్టి కావాలన్నా కప్పం కట్టి తెచ్చుకోవాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు.

రూ.లక్షల ఆదాయానికి గండి..

భూగర్భగనుల శాఖ నుంచి మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకుని తరలిస్తే క్యూబిక్‌ మీటరుకు రూ.60 చొప్పున రాయల్టీ చెల్లించాల్సి ఉంది. ఇక్కడ నుంచి నిత్యం 3వేల క్యూబిక్‌ మీటర్లపైగా మట్టి తరలిపోతోంది. ఈ లెక్కన రోజుకు రూ.1.80లక్షల సొమ్ము భూగర్భగనులశాఖకు జమకావాల్సి ఉంది. అనుమతి తీసుకోకపోవడంతో ఒక్క రూపాయి రాయల్టీ చెల్లించకుండానే తరలిస్తున్నారు. రోజుకు రూ.లక్షల్లో పెద్దఎత్తున ప్రభుత్వాదాయానికి గండిపడుతున్నా యంత్రాంగం నేతల ఒత్తిడితో అక్రమ తవ్వకాలు అడ్డుకోలేని పరిస్థితి. ఈప్రాంతంలో ఫిబ్రవరి 8 నుంచి 21 తేదీ వరకు 600 క్యూబిక్‌ మీటర్లకు రూ.36 వేలు చెల్లించి పర్మిట్లు తీసుకున్నారు. అధికారులు తనిఖీలు చేసి ఇప్పటివరకు తవ్విన ప్రాంతంలో కొలతలు తీసి అక్రమంగా తరలించిన మట్టి పరిమాణం లెక్క తేల్చితే రూ.కోట్లలో జరిమానా విధించే అవకాశం ఉంది. అక్రమ తవ్వకాలపై యంత్రాంగం దృష్టిసారించాల్సి ఉంది. దాడులతో సరిపెట్టకుండా అక్రమంగా తరలించిన మట్టికి రాయల్టీ, జరిమానా వసూలు చేయాల్సి ఉందని స్థానికుల నుంచి డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

ఆకస్మిక తనిఖీలతో అడ్డుకుంటాం..

కోటప్పకొండ పరిసరాల్లో మట్టి అక్రమ తవ్వకాలపై ఇప్పటికే రెండుసార్లు దాడులు చేసి బాధ్యులపై జరిమానా విధించాం. ఒకసారి రూ.2లక్షలు, మరోసారి రూ.18.50 లక్షలు జరిమానా విధించి వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. అక్కడ కేవలం 600 క్యూబిక్‌మీటర్లకు మాత్రమే అనుమతులు ఇచ్చాం. అక్రమ తవ్వకాలపై ఆకస్మిక దాడులు చేసి అడ్డుకట్ట వేస్తాం.

- విష్ణువర్ధన్‌రావు, సహాయ సంచాలకులు, భూగర్భగనులశాఖ

ఇదీ చదవండి:

పల్లెపోరు: ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పోలింగ్ ఏజెంట్​పై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.