ETV Bharat / state

'అమరావతి ఉద్యమాన్ని అణచివేసేందుకే అక్రమ కేసులు' - అమరావతి నిరసనలు

అమరావతికి మద్దతుగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 55వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పాల్గొన్న నిరసనకారులకు ముస్లింలతో పాటు మాజీ మంత్రి నక్కా ఆనంద్​బాబు సంఘీభావం ప్రకటించారు.

అమరావతి ఉద్యమాన్ని అణచివేయటానికే అక్రమ కేసులు

author img

By

Published : Feb 21, 2020, 1:33 PM IST

అమరావతి ఉద్యమాన్ని అణచివేయటానికే అక్రమ కేసులు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. గుంటూరు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 55వ రోజుకు చేరుకున్నాయి. జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన దీక్షకు ముస్లింలతో పాటు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సంఘీభావం తెలియజేశారు. రాజధాని ఉద్యమాన్ని అణచివేసేందుకే ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని నక్కా మండిపడ్డారు. మందడంలో డ్రోన్ కెమెరా వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

వైకాపా ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని.., వారి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోందన్నారు. అధికారం కోసం వైకాపా నాయకులు వీధి పోరాటాలకు దిగుతున్నారని విమర్శించారు. రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

ఇదీచదవండి

మూడు రాజధానులకు సీపీఐ వ్యతిరేకం: రాజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.