గుంటూరులో వంశీకృష్ణ అనే వైద్యుని ఇంట్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద నుంచి 1.5 లక్షల రూపాయల విలువైన 37 కు పైగా స్వదేశీ మద్యం, 12 రకాల విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించారు. మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తెనాలికి చెందిన రహ్మత్ బేగ్ అలియాస్ అహ్మద్ అనే వ్యక్తి నుంచి వైద్యునికి మద్యం బాటిళ్లు సరఫరా అవుతున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి వద్ద మూడు బాటిళ్లకు మించి ఉండటానికి వీల్లేదని... అలా ఎవరైనా నిల్వచేస్తే.. చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చదవండి: