పోషకాహార లోపం, రక్తహీనత నివారణే లక్ష్యంగా ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీలు పని చేయాలని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. గుంటూరులోని ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీఓలతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసినందున అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్. ఐ. డి. ఎఫ్ 23 కింద మంజూరు చేసిన అంగన్వాడి భవన నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేసి పనులు ప్రారంభించాలన్నారు. మెప్మా సిబ్బంది సహకారంతో సర్వీస్ ప్రొవైడర్ ద్వారా సేవలు అందజేయనున్నట్లు తెలిపారు. బాలలు లేని కేంద్రాలను ఎక్కువమంది ఉన్న ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలను ఇచ్చారని వివరించారు.
ఇదీ చదవండి