గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వైకాపా ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేపట్టి 3 ఏళ్లు అయిన సందర్భంగా జిల్లాలోని ఫిరంగిపురంలో వైకాపా నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హాజరయ్యారు. పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు, నేతలకు ఆయన సూచించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా గ్రామాలు శుభ్రంగా ఉండేందుకు కృషి చేయాలని తెలిపారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ... పేదల సంక్షేమానికి సీఎం జగన్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు.
మొదట ఫిరంగిపురం క్రైస్తవ నగర్లో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు. రేపూడి గ్రామంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ముగించారు.
ఇదీ చదవండి
సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేను: ఏజీ కె.కె.వేణుగోపాల్