ETV Bharat / state

ఎరక్కపోయి ఎక్కాడు.. పట్టుజారి ఇరుక్కుపోయాడు - హైదరాబాద్​లో బండరాళ్ల మధ్య ఇరుక్కున్న యువకుడు

Man stucked between stones in Hyderabad : సరదా.. ఓ యువకుడి ప్రాణాలు మీదకు తెచ్చింది. ఊరు శివారులోని ఓ ప్రదేశానికి వెళ్లిన యువకుడు అక్కడ రెండు బండరాళ్లను చూసి సరదాపడి వాటిపైకి ఎక్కాడు. అంతలోనే పట్టుతప్పి పడిపోయి వాటి మధ్యలో ఇరుక్కున్నాడు. ఇక అందులో నుంచి బయటకు రాలేక నానా తిప్పలు పడ్డాడు. ఎట్టకేలకు అటుగా వెళ్లే వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో గంటల పాటు శ్రమిస్తే చివరకు అతికష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?

Struck
ఇరుక్కుపోయాడు
author img

By

Published : Jan 31, 2023, 2:09 PM IST

Man stucked between stones in Hyderabad : సరదా పడి ఓ యువకుడు పెద్ద బండ ఎక్కాడు.. పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలోకి జారి పడిపోయాడు. దాదాపు 3 గంటల పాటు అందులో ఇరుక్కుపోగా పోలీసులు శ్రమించి బయటకు తీశారు. దాదాపు 3 గంటల పాటు నరకయాతన అనుభవించిన యువకుడు పోలీసుల సాయంతో ఎట్టకేలకు బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. తెలంగాణలోని తిరుమలగిరి ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు.

మహారాష్ట్రకు చెందిన రాజు(26) బతుకు దెరువుకోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. సోమవారం సాయంత్రం తిరుమలగిరి కెన్‌ కళాశాల సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ ఉన్న పెద్ద బండను చూసి సంబరపడి దానిపైకి ఎక్కాడు. పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలో పడ్డాడు. బయటకు రాలేక కేకలు వేశాడు. స్థానికులు గుర్తించి తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు.

బాధితుడు రాజు

విషయం తెలుసుకున్న కానిస్టేబుళ్లు రాంబాబు, బాషా, రాజు.. అక్కడికి చేరుకొని అతడి భూజానికి తాళ్లు కట్టి అతికష్టం మీద బయటకు లాగారు. అనంతరం చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సోమవారం రాత్రి సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వదిలారు. రాజును కాపాడిన కానిస్టేబుళ్లను సీఐ శ్రావణ్‌కుమార్‌ అభినందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.