వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్కు చెందిన రజిత, మరో నలుగురు గర్భిణులు ప్రసవ సేవల కోసం కరీంనగర్ జిల్లాలోని హూజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. ముందుగా వైద్యులు.. రజితకు శస్త్ర చికిత్స చేశారు. ఆమె ఆడశిశువు జన్మించింది. ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఓ తప్పు చేశారు.
ఆస్పత్రి సిబ్బంది రజితకు పుట్టిన బిడ్డను.. రచన అనే మరో మహిళ కుటుంబసభ్యులకు ఇచ్చారు. ఈ ఘటనపై రజిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్.. ఆపరేషన్ థియేటర్ వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. రచనకు ఇంకా డెలివరీ కాలేదని.. రజిత కుటుంబసభ్యులను పిలువగా.. రచన కుటుంబసభ్యులు వచ్చి పాపను తీసుకున్నారని పేర్కొన్నారు. శిశువులను అందించే క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటామని.. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగవని తెలిపారు. సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీ చూడండి:ఆరోగ్య ప్రదాయిని అరటి.. అందుకే డైట్‌లో భాగం చేసుకోండిలా!