ETV Bharat / state

భార్యను ఇనుప రాడ్​తో కొట్టి చంపిన భర్త - prathipadu latest news

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్య తలపై ఇనుప రాడ్​తో కొట్టి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

husband-killed-wife-in-guntur-prathipadu
author img

By

Published : Nov 15, 2019, 10:01 AM IST

Updated : Nov 15, 2019, 10:08 AM IST

భార్యను ఇనుప రాడ్​తో కొట్టి చంపిన భర్త

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో కట్టుకున్న భార్యనే ఇనుపరాడ్​తో కొట్టి కిరాతకంగా హతమార్చాడు ఓ భర్త. ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన వెంకట్రావు, సీతారావమ్మలకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. గత నాలుగేళ్ల నుంచి భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. నాలుగు నెలల క్రితమే సీతారావమ్మ భర్త దగ్గరకు వచ్చి ఉంటుంది. నిన్న రాత్రి రక్తపు మడుగులో పడి ఉన్న సీతారావమ్మను చూసి స్థానికులు.. 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు పరిశీలించి అప్పటికే ఆమె చనిపోయినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

అరకులో ఆ కాఫీ తాగితే... పది మందితో తాగిస్తారు!

Intro:Ap_gnt_61_15_bharya_pai_bhartha_dhadi_mruthi_av_AP10034

Contributor : k. Vara prasad ( prathi padu ),guntur

Anchor , గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో కట్టుకున్న భర్త...భార్య పై ఇనుప రాడ్ తో దాడి చేసి చేయడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన సాని వెంకట్రావు, సీతారావమ్మలకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. గత నాలుగేళ్ళ నుంచి భార్య భర్తల దూరంగా ఉంటున్నారు. గతేడాది వెంకట్రావు వ్యవసాయ పనుల నిమిత్తం ప్రతిపాడుకు వచ్చాడు. నాలుగు నెలల క్రితం సీతారావమ్మ కూడా భర్త దగ్గరకు వచ్చి ఉంటుంది. మరి వారిద్దరి మధ్య ఏమి జరిగిందో ఏమో గాని రాత్రి సీతారావమ్మ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించారు. వైద్య సిబ్బంది పరిశీలించి ఆమె మృతి చెందినట్లు చెప్పారు. ఇనుప రాడ్ తో తల పై కొట్టి ఉండొచ్చని పోలీసులు తేల్చారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. గత ఏడాది కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు మృతురాలి కుమారుడికి తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Body:EndConclusion:End
Last Updated : Nov 15, 2019, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.