గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెంలో భార్యపై అనుమానంతో భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. ఒడిశాకు చెందిన ఫోపూన్ గనూన్, రీటా దంపతులకు.. 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ స్థానిక ఉన్న రంగనాయక స్పిన్నింగ్ మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. భార్య మీద అనుమానంతో ఆదివారం భర్త ఫోపూన్ గనూన్.. బ్లేడుతో గొంతు కోసి హతమార్చేందుకు ప్రయత్నించాడు.
స్థానికులు విషయాన్ని గుర్తించి.. గనూన్ను విద్యుత్ స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న యడ్లపాడు ఎస్సై పైడి రాంబాబు.. బాధితురాలు రీటాను చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. గనూన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి:
120 ఏళ్ల క్రితమే దేశంలో లాక్డౌన్
ఎంపీ రఘురామకు కొనసాగుతున్న వైద్య పరీక్షలు.. నివేదిక కోసం కోర్టు నిరీక్షణ