మద్యానికి అలవాటు పడిన భర్త.. భార్యపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడులో జరిగింది.
బతుకుతెరువు కోసం వచ్చి..
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం రామాపురానికి చెందిన మేకల నారాయణ అతని భార్య కోటేశ్వరమ్మ బతుకుతెరువు కోసం.. మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి 6 నెలలు క్రితం వలస వచ్చారు. వీరికి ముగ్గరు సంతానం. దంపతులిద్దరూ పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వివాహం జరిగిన ఏడాది నుంచి నారాయణ మద్యం సేవిస్తూ భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలి సోదరుడు చెప్పారు. ఈ విషయమై గతేడాది రాజుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారన్నారు.
అయితే గత 10 రోజుల నుంచి మద్యానికి డబ్బులు కావాలని కొటేశ్వరమ్మను వేధిస్తున్నాడని.. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మద్యం సేవించి కొబ్బరిబోండాల కత్తితో భార్యపై దాడి చేసినట్లు ఆరోపించారు. తన సోదరి పైన దాడికి పాల్పడిన నారాయణను కఠినంగా శిక్షించాలని కోరాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పిడుగురాళ్ల సీఐ ఆంజనేయులు తెలిపారు.
ఇదీ చదవండి: