ETV Bharat / state

రూ.30 లక్షల విలువైన తెలంగాణ మద్యం పట్టివేత - గుంటూరు జిల్లా తిమ్మాపురం వద్ద ఎస్​ఈబీ పోలీసుల తనిఖీలు

పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని గుంటూరు జిల్లా తిమ్మాపురం వద్ద ఎస్​ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరకు విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని ఎస్​ఈబీ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

hug telangana liquor seized at thimmapuram
తెలంగాణ మద్యం పట్టివేత
author img

By

Published : May 22, 2021, 4:53 PM IST

పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణా పెద్దఎత్తున సాగుతూనే ఉంది. తాజాగా గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం అడ్డరోడ్డు వద్ద ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టిప్పర్​లో అక్రమంగా తరలిస్తున్న రూ. 30 లక్షల విలువైన 3156 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్ పారిపోయాడు.

ఈ కేసులో తిమ్మాపురం గ్రామానికి చెందిన పావులూరి రామయ్య, మూర్తి, గురజాల శ్రీనులను ప్రాథమికంగా గుర్తించినట్లు ఎస్ఈబీ ఎక్సైజ్​ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూదవండి..ఆనందయ్య ఇచ్చే కరోనా మందు మంచిదా? కాదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.