ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం - ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు.

house sights
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం
author img

By

Published : Jan 6, 2021, 12:15 PM IST

ఆవాసం లేని ప్రతి కుంటుంబానికి ఇళ్లే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పట్టాల పంపీణీ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి.

గుంటూరు జిల్లాలో...

మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామంలో కలెక్టర్ ఆనందకుమార్, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి 68మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. జిల్లాలో మూడు లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్​ తెలిపారు. ఇంటి పట్టా అందుకున్న ప్రతి ఒక్కరికి రెండున్నర లక్షలు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆప్షన్లను గ్రామ వలంటీర్లు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్ సూచించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తున్నారని ఎమ్మల్యే శ్రీదేవి చెప్పారు. గుంటూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, మేడికొండూరు తహశీల్దార్ కరుణకుమార్, ఎంపీడీవో శోభారాణి, గృహనిర్మాణశాఖ డీఈ శంకర్, పలువురు అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లాలో...

ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మహాసంకల్పమే ఈ ఇళ్లపట్టాల పంపిణీ అని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. మొవ్వ మండలం కూచిపూడిలో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో "నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పంపిణీ" కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథిలుగా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు పాల్గొన్నారు. లబ్ధిదారులు,అధికారులు, పాల్గొన్నారు.

పశ్చిమ గోదవరి జిల్లాలో...

జిల్లాలోని అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో నవరత్నలో భాగంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి లబ్ధిదారులకు స్థల పట్టాలను, ఇళ్ల నిర్మాణం మంజూరు పత్రాలను అందజేశారు. ఎన్నికలకు ముందు 25 లక్షల ఇళ్లు ఇస్తామని ప్రకటించి 30 లక్షలు ఇళ్లు ఇస్తున్న దార్శనికుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి అన్నారు. కార్యక్రమం ప్రారంభంలో ఇళ్ల పంపిణీ పైలాన్ ఆవిష్కరించారు. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీపై స్టేటస్‌ కో: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.