వరదలు వస్తే ఇసుక దొరకదనే విషయం... ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా అని హోంమత్రి సుచరిత ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో వర్షాలు లేక... ప్రాజెక్టులు నిండక ఇసుక అందుబాటులో ఉండేదన్న సుచరిత... ప్రస్తుతం నదుల్లో నీరు ఉండటం కారణంగా ఇసుక సరఫరా చేయడం వీలు కాలేదని వివరించారు. ఇప్పుడు ఇసుక అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. 80 వేల టన్నుల ఇసుక అవసరం కాగా... లక్షా 20 వేల టన్నులు సరఫరాకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఏదో ఒక అంశంతో ప్రజల్లో ఉండాలని... చంద్రబాబు ఇలా దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: వైద్యులు ఇలా చెప్పారు... చంద్రబాబు అలా అన్నారు