పరిపాలన సక్రమంగా సాగితేనే.. అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా అందుతాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాజ్యాంగ నిర్మాత వర్దంతిని పురస్కరించుకొని గుంటూరు లాడ్జి సెంటర్ లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం జగన్.. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడు లేని విదంగా విద్యా రంగానికి సీఎం పెద్దపీట వేశారని పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50 శాతం కేటాయిస్తూ సామాజిక న్యాయం పాటిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, పలువురు నాయుకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: