క్రిస్మస్ కానుకగా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇంటి స్థలంతో పాటు...నూతన గృహాలను కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
గతంలో ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో చెప్పిన హామీలు నెరవేర్చలేదని... సీఎం జగన్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఇప్పటికే 90 శాతం పూర్తి చేశారని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందని... ప్రతీ ఇంటికీ కనీసం 3 పథకాలు అందుతున్నాయని చెప్పారు. సీఎం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇదీ చదవండి:
'కరోనా వ్యాక్సినేషన్లో ప్రణాళికాయుతంగా బాధ్యతలు నిర్వర్తించాలి'