గుంటూరు జిల్లా, మేడికొండ మండలంలోని సిరిపురంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈయనతో పాటు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి, వైయస్సార్ జగనన్న పేరిట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వీరి మాటల్లో..
అర్హులైన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అందిస్తుంది. అంతేకాకుండా ఉచితంగానే ఇళ్లను కట్టించి ఇస్తుంది. కుల, మతాలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. రాష్ట్రంలో 30 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. వైద్యం విద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుంది. - ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు
పేదల సంక్షేమం కోసమే జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు. కోట్ల రూపాయలతో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువగా జగన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.
- తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి