గుంటూరు జిల్లా నకరికల్లు పోలీసులు ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ చట్టం , విపత్తుల నిర్వహణ చట్టం , ఐపీసీ సెక్షన్ల కింద నమోదుచేసిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో నకరికల్లు పోలీసులు ఓ కేసు నమోదు చేశారని న్యాయస్థానం గుర్తుచేసింది. ఒకే ఘటనకు సంబంధించి బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు సరికాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తుచేసింది. నకరికల్లు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ 217 ఆధారంగా జరిపే దర్యాప్తును నిలిపివేసింది.
పోలీసులకు, ఫిర్యాదిదారు కె.ప్రసాద్ కు నోటీసులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. కోడెల వర్ధంతి సభలో చేసిన వ్యాఖ్యలపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని అయన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించగా..హోంశాఖ మంత్రిని ఉద్దేశించి పిటిషనర్ వ్యక్తిగతంగా మాట్లాడలేదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావన్నారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి .. ఎస్సీ , ఎస్టీ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లు అక్కడ చోటు చేసుకున్న పరిస్థితులకు వర్తించవన్నారు.
ఇదీ చదవండి: