HIGH COURT ON HAYAGREEVA LANDS: నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తున్నందున విశాఖలో హయగ్రీవకు కేటాయించిన 12.51 ఎకరాలను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. హయగ్రీవ సంస్థ యాజమాన్య భాగస్వామితో పాటు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హయగ్రీవ సంస్థ నిర్మాణ పనులు చేపడుతోందని ఆప్రక్రియను నిలువరించేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా .. ప్రస్తుతం ఇవ్వలేమన్న ధర్మాసనం .. కౌంటర్లు దాఖలు చేసిన అనంతరం పరిశీలిద్దామని వ్యాఖ్యానించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: