గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగన్నకుంటతోపాటు పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. రోడ్లపై మోకాళ్ల లోతు వరకు వరద నీరు ప్రవహిస్తోంది.
భారీ వర్షం వచ్చినప్పుడు పక్కనే ఉన్న వాగు పొంగి కాలనీల్లోకి వరద వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఫలితంగా.. పాములు, విష పురుగులుతో ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను అధికారులు పరిష్కరించాలని బాధితులు కోరారు.
ఇవీ చూడండి: