గుంటూరు జిల్లాలోని అమరావతి, పెదకూరపాడు పరిసర ప్రాంతాల్లో తెల్లవారు జాము నుంచి కురుస్తున్న వర్షాలకు.... శివారు కాలనీల్లోని ఇల్లు నీటమునిగాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో భారీగా పంట నష్టం ఏర్పడింది. పెదకూరపాడు మండలం త్యాల్లూరు, పరస వద్ద కాలచక్ర రహదారిపైకి వరద నీరు చేరటంతో సత్తెనపల్లి, అమరావతి, గుంటూరుకి రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు