గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. మార్కెట్ సెంటర్, కళామందిర్ సెంటర్ ప్రాంతాలలో వర్షపు నీటితో రహదారులన్నీ చెరువులను తలపించాయి. ఈ మార్గంలో వాహనల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వెంటనే అధికార్లు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: శ్రీశైలంలో కొనసాగుతున్న వరద.. 3 గేట్లు ఎత్తివేత