గుంటూరు జిల్లా పొందుగుల వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. నిన్నటి ఘటన దృష్ట్యా పొందుగుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఏపీలోకి అనుమతించడం లేదని నిన్న పోలీసులపై ప్రయాణికులు రాళ్లు రువ్విన విషయం తెలిసిందే. పొందుగుల వద్ద ముళ్లకంచె ఏర్పాటు చేసి పోలీసులు భద్రతను పెంచారు. సరకు రవాణా వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. కూరగాయల వాహనాలనూ అనుమతి పత్రాలుంటేనే పంపిస్తున్నారు.
ఇదీ చదవండీ... ఓ కూలీ కథ: 135 కి.మీ. నడక- నీళ్లే ఆహారం