నాగార్జున సాగర్ నుంచి వస్తున్న వరదనీటితో పాటు... వర్షాల కారణంగా పులిచింతల జలాశయానికి వరద ఉద్ధృతంగా వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3లక్షల 4,228క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 10గేట్లు ఎత్తి 2లక్షల 92,228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 43.35 టీఎంసీలు నిల్వఉంది. ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికోసం12,000 క్యూసెక్కులు కేటాయించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున వరద ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ రాత్రికి 4లక్షల క్యూసెక్కులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. వరద తీవ్రతకు తగ్గట్లు మరికొన్ని గేట్లు ఎత్తనున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి. వర్షాలతో ఒక్క రోజుకి ఏడుకోట్ల నష్టం: జీవీఎంసీ కమిషనర్