ETV Bharat / state

లంచం తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్

author img

By

Published : Aug 28, 2020, 8:35 AM IST

లంచగొండిగా మారిన ఓ హెడ్​కానిస్టేబుల్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. అతను ఓ వ్యక్తి నుంచి 40 వేల రూపాయలు తీసుకున్నట్లు విచారణలో తేలటంతో అ.ని.శా అధికారులు చర్యలు చేపట్టారు.

head constable arrested by acb for taking bribe in chilakaluripet

గుంటూరు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్​లో హెడ్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న షేక్ ఖాజా మొహిద్దీన్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. పేకాట నిర్వాహకుల నుంచి 40 వేల రూపాయలు లంచం తీసుకున్నట్లు అభియోగం నిరూపితం కావటంతో అరెస్ట్ చేసిన అనిశా అధికారులు... రిమాండ్ నిమిత్తం శుక్రవారం విజయవాడ కోర్టులో హాజరు పరచనున్నారు.

మార్చి 23న చిలకలూరిపేట పట్టణం శివారు ప్రాంతంలో షేక్ నాగూర్ వలి అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. నాగూర్ వలి ద్విచక్ర వాహనంతో పాటు సెల్​ఫోన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తిరిగి తనకు ఇచ్చేందుకు హెడ్ కానిస్టేబుల్ షేక్ ఖాజా మొహిద్దీన్ 40 వేల రూపాయలు లంచం తీసుకున్నాడని నాగూర్ వలి గుంటూరు అ.ని.శా అధికారులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు... విచారణ నిర్వహించారు. లంచం వ్యవహారం నిజమని తేలటంతో ఆ హెడ్​కానిస్టేబుల్​ను అ.ని.శా అధికారులు అరెస్టు చేశారు. విజయవాడ అ.ని.శా ప్రత్యేక కోర్టులో శుక్రవారం హాజరుపరచనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.