GV Anjaneyulu Deeksha at Angaluru : గుంటూరు జిల్లా ఈపూరు మండలం అంగలూరు గ్రామం ఎస్సీ కాలనీలో మూడు రోజులుగా కరెంట్ తీసివేయడంతో.. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దీక్ష చేపట్టారు. విద్యుత్ పునరుద్ధరించే వరకు కదలబోమని జీవీ స్పష్టం చేశారు. కాలనీవాసులు కటిక చీకట్లో కాలం గడుపుతున్నట్లు సమాచారం తెలుసుకుని... వారికి మద్దుతుగా నిలిచారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నుంచీ నిరసన చేపట్టారు.
రాత్రంతా జాగారం..
ఎస్సీ కాలనీ మూడు రోజులుగా చీకటిలోనే మగ్గడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి.. నిరసనలోనే ఉన్నారు. చలిని లెక్క చేయకుండా.. అర్ధరాత్రి వేళ రోడ్డుపైనే పడుకున్నారు. కాలనీ వాసులతో కలిసి రోడ్డుపైనే రాత్రి నుంచి జీవీ నిరసన దీక్ష కొనసాగించారు. జీవీకి మద్దతుగా కాలనీవాసులు ఈ దీక్షలో పాల్గొన్నారు.
విద్యుత్ పునరుద్దరణ..
జీవీ దీక్షతో.. అంగలూరు ఎస్సీ కాలనీకి అధికారులు విద్యుత్ పునరుద్ధరణ చేశారు. విద్యుత్ వచ్చిన తర్వాతనే.. తెదేపా నేత జీవీ ఆంజనేయులు దీక్ష విరమించారు. ఈ దీక్షకు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సంఘీభావం తెలిపారు. విద్యుత్ అధికారుల హామీతో 18 గంటల దీక్షను జీవీ ఆంజనేయులు విరమించారు.
ఇదీ చదవండి: Chandrababu letter to DGP: 'తిక్కారెడ్డికి ఏం జరిగినా.. ప్రభుత్వానిదే బాధ్యత'