రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని.. గుంటూరు జిల్లా తాడేపల్లి సాంఘిక సంక్షేమ కార్యాలయ ముట్టడికి వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కరెంటు బిల్లుల చెల్లింపులు, కూరగాయలు, సరకులు నిలిచిపోవడంతో విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సుమారు 10 నెలలకు పైగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ వర్కర్స్ యూనియన్ నిరసన