ETV Bharat / state

ఎవరైనా ఒక్కటే.. మాస్క్​ పెట్టుకోని ట్రాఫిక్​ సీఐకి ఎస్పీ జరిమానా

నిబంధనలు ఉల్లఘించిన వారికి పోలీసులు జరిమానాలు విధిస్తారు. అటువంటి పోలీసులే రూల్స్​ అతిక్రమిస్తే..? కరోనా ప్రబలుతున్న వేళ మాస్క్​ ధరించకుండా విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ట్రాఫిక్​ సీఐకి గుంటూరు అర్బన్​ ఎస్పీ జరిమానా విధించి.. మాస్క్​ అందించారు.

Urban SP wearing mask to Traffic CI
ట్రాఫిక్​ సీఐకి మాస్క్​ తొడుగుతున్న అర్బన్​ ఎస్పీ
author img

By

Published : Mar 30, 2021, 1:09 PM IST

Updated : Mar 30, 2021, 5:47 PM IST

కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. గుంటూరు అర్బన్‌ పరిధిలోని లాడ్జి కూడలి, ఎంటీబీ కూడలిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు.

ట్రాఫిక్​ సీఐకి మాస్క్​ తొడుగుతున్న అర్బన్​ ఎస్పీ

లాడ్జి కూడలిలో మాస్కు ధరించకుండా వెళ్తున్న తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావును ఆపి ఎస్పీ ప్రశ్నించారు. హడావుడిలో మాస్క్​ మర్చిపోయానని సీఐ సమాధానమివ్వగా.. ఆయనకు జరిమానా విధించి.. ఎస్పీ స్వయంగా మాస్కు తొడిగారు. కొవిడ్​ విజృంభిస్తున్న సమయంలో పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించని వాహనదారులను ఆపి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ కోరారు.

అయితే సీఐకి ఎంత జరిమానా విధించారనే విషయం పోలీసులు బయటకు చెప్పడం లేదు.

ఇదీ చదవండి: కొవిడ్ అంటే భయం లేదు.. ఎంచక్కా గుంపులుగా ఆడిపాడుతున్నారు

Last Updated : Mar 30, 2021, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.