స్థానిక ఎన్నికలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. చేబ్రోలు పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్బన్ పరిధిలో తొలి విడత ఎన్నికలు చేబ్రోలు మండలంలో మాత్రమే ఉన్నాయని తెలిపారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. త్వరలోనే మిగిలిన మండలాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు.
మండలంలో 29 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశామని చెప్పారు. మంచాల, నారాకోడూరు, గరువుపాలెం గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు రాకుండా నిరోధించటంతో పాటు గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమ తరలింపును నిలువరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ, జేసీ ప్రశాంతి మధుసూదన్ రావు, ఎస్సై కిషోర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: