గుంటూరులో కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వస్తున్న వాహనాలను తనిఖీచేస్తున్న పోలీసులు.. అనుమతి పత్రాలు లేని వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఎస్పీ అమ్మిరెడ్డి క్షేత్రస్థాయిలో కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు.
సొంత పనులు నిమిత్తం ఇతర గ్రామాలు వెళ్లి వచ్చేవారిని ప్రశ్నించిన పోలీసులు.. సరైన కారణాలు, పత్రాలు లేని పలు కార్లను సీజ్ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ఆయన సూచించారు. ఏ కారణం లేకుండా బయట తిరగాలనుకునే వారి వాహనాలు సీజ్ చేస్తామని.. రెండోసారి దొరికితే కోర్టు ద్వారా మాత్రమే వాహనాలు తీసుకోవలసి ఉంటుందని ఎస్పీ హెచ్చరించారు. కొవిడ్ వైరస్ నివారణ, నియంత్రణ లక్ష్యంగా అమలు చేస్తున్న కర్ఫ్యూను ప్రజలు విజయవంతం చేయాలని ఎస్పీ కోరారు.
ఇదీ చదవండి: