హెపటైటిస్ - బి వ్యాధిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. ఆ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా జైలులో నిర్వహించిన హెపటైటిస్ నివారణ అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి ఇలాంటి సమస్యలు దరిచేరవని చెప్పారు. అనంతరం హెపటైటిస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఎస్పీ చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి జైలు సూపరింటెండెంట్, సిబ్బంది హజరయ్యారు.
ఇదీ చదవండి:
హెపటైటిస్ నిర్మూలనకు మోడల్ ట్రిట్‌మెంట్ కేంద్రం.. ఎక్కడో తెలుసా?