గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు గ్రామీణ పరిధిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీగా ఆయన విధులు నిర్వహిస్తున్న ఆరిఫ్ హఫీజ్ పదోన్నతిపై.. ఎస్పీగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
ఇదే స్థానంలో పని చేసిన అమ్మిరెడ్డిని మంగళగిరి డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. సెబ్ ఏఎస్పీగా జిల్లాలో పనిచేసిన అనుభవంతో...అర్భన్ పరిధిలోని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చెప్పారు. కరోనా కష్టకాలంలో పోలీసులు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్నారని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: