గుంటూరు పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆర్. ముత్తురాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ముత్తురాజ్ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ డెవలప్మెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పొగాకు లావాదేవీలు, ఎగుమతులు, రైతులకు సంబంధించిన వ్యవహారాల్లో పొగాకు బోర్డు కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు పొగాకు బోర్డు ఈడీగా ఉన్న ఐఏఎస్ అధికారిణి కె. సునీతను ఆమె విజ్ఞప్తి మేరకు ఏపీ కేడర్‌కు పంపిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి...