ETV Bharat / state

మానవత్వాన్ని చూపిన ఎమ్మెల్యే.. యువకుడి ప్రాణాలకు తప్పిన ప్రమాదం - తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వార్తలు

వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వైద్యురాలైన శ్రీదేవి తన వృత్తి ధర్మాన్ని పాటించారు. ఆమె గుంటూరు నుంచి పిడుగురాళ్ల వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్నాడు. వెంటనే ఆమె ఆ వ్యక్తి వద్దకు చేరుకుని ప్రథమ చికిత్సను అందించి అతని ప్రాణాలను కాపాడారు.

guntur tadikonda mla sridevi shows her humanity towards accident affected victim
ఎమ్మెల్యే తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది... వ్యక్తి ప్రాణాలను కాపాడింది
author img

By

Published : Aug 7, 2020, 9:45 AM IST

గుంటూరు జిల్లా తాడికొండ వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వైద్యురాలైన శ్రీదేవి తన వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి... ప్రథమ చికిత్స చేశారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే గుంటూరు నుంచి పనిమీద వేరేచోటకి వెళ్తుండగా... లారీ, ద్విచక్రవాహం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కరోనా భయంతో అక్కడ ఉన్న స్థానికులు సైతం గాయపడిన వ్యక్తి వద్దకు వెళ్లే కనీస ప్రయత్నం చేయలేదు.

వైద్యురాలయిన శ్రీదేవి వెంటనే తన వాహనంలో నుంచి దిగి గాయపడిన వ్యక్తి దగ్గరకు చేరుకుని నాడిని పరిశీలించారు. ప్రథమ చికిత్స అందించారు. అనంతరం దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

అక్టోబరు 15న కళాశాలలు తెరవాలి: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.