ETV Bharat / state

దుగ్గిరాల అత్యాచార ఘటనలో ట్విస్ట్​​.. వెలుగులోకి కొత్త విషయాలు - duggirala murder case updates

SP Arif Hafeez on Duggirala Murder Case: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో హత్యాచార ఘటనపై గుంటూరు అర్భన్​ ఎస్పీ స్పందించారు. సదరు మహిళపై అసలు అత్యాచారమే జరగలేదని.. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందని ఎస్పీ వెల్లడించారు. శాస్త్రీయ ఆధారాల ద్వారా దర్యాప్తు చేస్తున్నామన్న ఎస్పీ.. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

sp arif hafeez on duggirala murder case
గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్
author img

By

Published : Apr 28, 2022, 7:30 PM IST

Updated : Apr 29, 2022, 5:41 AM IST

Duggirala Murder Case Updates: ఓ గృహిణితో ఉన్న పరిచయాన్ని అలుసుగా చేసుకుని అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. వారిలో ఒకరు ఒంటరిగా ఉన్న ఆమెను బలాత్కరించేందుకు యత్నించగా.. ఆమె ఎదురుతిరిగారు. అందరికీ చెబుతానంటూ కేకలు వేశారు. అంతే... రెచ్చిపోయిన ఆ యువకుడు చీర కొంగును గొంతుకు బిగించి ఆమెను చంపేశాడు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో బుధవారం మధ్యాహ్నం వీరంకి శ్రీలక్ష్మీ తిరుపతమ్మ (34) హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇంట్లోకి చొరబడి మరీ వివాహితపై అత్యాచారానికి యత్నించటం, ఆమెను చంపటం దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే పోలీసులు మాత్రం వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగిందని గురువారం ప్రకటించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు. గుంటూరు ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ విలేకరుల సమావేశంలో ఈ హత్య వివరాలు వెల్లడించారు. నిందితుల్లో ఒకరే హత్య చేశారని తెలిపారు. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది.

మాట్లాడుతున్న ఎస్పీ

ఎస్పీ ఏం చెప్పారంటే...

‘తుమ్మపూడి వాసి కొర్రపాటి వెంకట సాయిసతీష్‌కు బాధితురాలితో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. అతని స్నేహితుడైన మరీదు శివ సత్య సాయిరామ్‌తో కలిసి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆమె ఇంటికి వెళ్లారు. తొలుత సాయిసతీష్‌ లోపలికి వెళ్లి, కాసేపటికి బయటకొచ్చేశాడు. తర్వాత శివ సత్యసాయిరామ్‌ వెళ్లి, తన కోరిక తీర్చాలని బాధితురాలిని బలవంతం చేశాడు. ఆమె ఎదురుతిరిగారు. ఈ విషయాన్ని అందరికీ చెబుతానంటూ గట్టిగా అరిచారు. దీంతో శివసాయిరామ్‌ చీర కొంగును ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. ఆ తర్వాత వారిద్దరూ బాధితురాలి సెల్‌ఫోను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ కేసులో నిందితులు ఇద్దర్నీ అరెస్టు చేశాం. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగింది. సామూహిక అత్యాచారం కాదు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణమూ లేదు’ అని ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ విలేకరులకు గురువారం తెలిపారు. మృతురాలి ఫోన్‌ను డేటా విశ్లేషణ కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిస్తామని ఆయన చెప్పారు. ఐపీసీలోని 376 రెడ్‌విత్‌ 511, 302, 211 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా మరిన్ని సెక్షన్లు జోడిస్తామని వివరించారు.

చంపుతుంటే ఎందుకు అడ్డుకోలేదు?

ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి ఎస్పీ తెలిపిన వివరాలు చూస్తే అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

* సాయిసతీష్‌కు బాధితురాలితో వివాహేతర సంబంధం ఉందని ఎస్పీ చెప్పారు. మరి తన స్నేహితుడిని వెంట ఎందుకు తీసుకెళ్లాడు? అతను బాధితురాలిని బలాత్కరించేందుకు ప్రయత్నిస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు?

* సత్యసాయిరామ్‌ బాధితురాలిని చంపుతున్నప్పుడు సాయిసతీష్‌ ఎక్కడ ఉన్నారు?

* సాయిరామ్‌ ఒక్కడే హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అది నిజమేనా? అతనికి ఎవరైనా సహకరించారా?

* నిందితులిద్దరూ కలిసి వెళ్లారనేది పోలీసుల మాట. మరి సామూహిక అత్యాచారం జరిగిందా.. అనే కోణంలో దర్యాప్తు చేయకుండానే జరగలేదని ఎలా ప్రకటిస్తారు? ఘటనా స్థలంలో మృతదేహం వివస్త్రగా ఉండటం, శరీరంపై గాట్లు ఉండటం చూస్తే సామూహిక అత్యాచారం జరిగిందన్న అనుమానాలు కలగడం లేదా?

* అప్పటికప్పుడు కోపంతో చంపేశారా.. ముందుగా ప్రణాళిక ఏమైనా ఉందా అనే కోణంలో విచారించారా?

* బుధవారం మధ్యాహ్నం 2-3 గంటల మధ్య హత్య జరిగింది. బాధితురాలి తల్లి సాయంత్రం పోలీసులకు ఫోన్‌ చేయగా.. వారు ఆమెను పిలిపించుకుని రాత్రి 7 గంటల సమయంలో నేరుగా ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. అన్ని గంటల పాటు హత్య విషయం బయటకు తెలియలేదా?

* మధ్యాహ్నం తాను తిరుపతమ్మ ఇంటికి వెళ్లగా ఆమె ఒంటిపై దుస్తులు సక్రమంగా లేకపోవటం, నాలుక బయటకు రావటం చూసి వెంటనే పోలీసులు, 108కు సమాచారమిచ్చినట్లు సాయిరాం చెబుతున్నారు. ఇంతకీ పోలీసులకు ఎవరు ఫిర్యాదు చేశారు?

మాకు అన్యాయం జరిగింది: భర్త

‘ఈ హత్యపై నా కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానితుల పేర్లను ఫిర్యాదులో రాస్తుంటే పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పేర్లు చెప్పొద్దని, న్యాయం చేయాలని మాత్రమే కోరాలని గదమాయించారు. నిందితులకు వైకాపా నేతలతో సంబంధాలు ఉన్నాయి. అందుకే పోలీసులు కేసు నీరుగార్చాలని చూస్తున్నారు. నేను వైకాపాకే ఓటు వేశా. మాకు అన్యాయం జరిగింది’ అని మృతురాలి భర్త శ్రీనివాసరావు గురువారం మీడియాతో వాపోయారు. ఈ విషయమై ఎస్పీని విలేకరులు ప్రశ్నించగా.. ఫిర్యాదు చేసింది మృతురాలి తల్లి అని, ఆమె భర్త తమకు ఫిర్యాదు చేయలేదన్నారు.

అసలేం జరిగింది... : బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తిరుపతమ్మ బంధువైన ఓ యువకుడు ఆమెను కలవడానికి ఇంటికి వెళ్లాడు. ఆమె ఒంటిపై దుస్తులు సక్రమంగా లేకుండా అచేతనంగా పడి ఉండటం గమనించి పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. తిరుపతమ్మకు పదిహేనేళ్ల కిందట శ్రీనివాసరావు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పొలాలకు నీళ్లు పెట్టే ట్యూబులు అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాసరావు పనుల కోసం గ్రామం విడిచి వెళుతుంటాడు. ఒకసారి వెళ్తే ఐదు, ఆరు నెలలు ఇంటికి రారు. గతేడాది డిసెంబరులో ఆయన పనులు కోసం ఇంటి నుంచి వెళ్లారు. మృతురాలి ఇంటి తలుపులు తెరిచి ఉండడం.. ఆమె చెవి రింగులు పక్కనే పడిపోవడం.. గొంతుపై గట్టిగా నులిమినట్లు గుర్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి భర్తను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన రైల్వేశాఖలో ఎలక్ట్రికల్ పనులు కోసం వెళ్లానని ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు చెప్పారు. తాను వెంటనే గ్రామానికి బయల్దేరి వస్తున్నానని, మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటలలోపే నిందితులను పట్టుకొని కేసును ఛేదించారు.

ఇదీచదవండి: గుంటూరు జిల్లాలో వివాహితపై హత్యాచారం.. పోలీసుల అదుపులో అనుమానితులు

Last Updated : Apr 29, 2022, 5:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.