ETV Bharat / state

నిధులు జమ చేయకపోతే పోరాటమే.. గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం - గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం

గ్రామ పంచాయతీల నిధుల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని.. గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికై ఏడాది గడిచినా.. ఇప్పటివరకూ గౌరవ వేతనం కూడా ఇవ్వలేదన్నారు.

guntur  Sarpanches Association
guntur Sarpanches Association slams state govt
author img

By

Published : Feb 7, 2022, 4:21 PM IST

సర్పంచులుగా ఎన్నికై ఏడాది గడిచినా.. తమకు రావాల్సిన నిధులు, విధుల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం విమర్శించింది. ఈ మేరకు బ్రాడిపేటలో సర్పంచుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన సంఘ అధ్యక్షుడు పాపారావు... కొత్త సర్పంచులకు ఇప్పటి వరకూ గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే తమ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రత్యేక కార్యాచరణతో వచ్చే నెల నుంచి పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.

ఇదీ చదవండి

సినిమా టికెట్ల ధరల వివాదం.. జగన్, చిరంజీవి భేటీ వ్యక్తిగతం: మంచు విష్ణు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.