సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ప్రజా సమస్యలను స్వత్వరమే పరిష్కరించడానికి గుంటూరు రూరల్ పోలీసుల పేరుతో... సోషల్ మీడియా వింగ్‌ని ఏర్పాటు చేశామని గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. సోషల్ మీడియా వింగ్‌కి సంబంధించిన లోగోను గుంటూరు ఎస్పీ కార్యాలయంలో విడుదల చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి వీలు ఉంటుందన్నారు. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో బాధ్యులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని... 24 గంటలు అందుబాటులో ఉంటామని వివరించారు.
ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నామన్నారు. ఇది కేవలం గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని ప్రజలు మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి సోషల్ మీడియాకి వచ్చే సమస్యలను... సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
సోషల్ మీడియా వింగ్ ఖాతాల వివరాలు :
వాట్సప్ - 88-66-26-88-99
ఫేస్బుక్ - guntur Rural district (police)
ట్విట్టర్ - @GntRuralpolice
ఇన్స్టాగ్రామ్ - Gunturruraldistrict౼police.
ఇదీ చదవండి: