గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్న పాఠశాలలు, కళాశాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా... విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్‌కి వినతి పత్రం అందజేశాారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి లేఖను ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలోని మైనారిటీ గురుకుల పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించాలని కోరారు. ప్రస్తుతం అద్దె భవనంలో మైనారిటీ గురుకుల పాఠశాల కొనసాగుతుందని తెలిపారుు. ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో వసతి గృహం లేదని.. పూర్తి స్థాయిలో సుమారు 500 మంది బాలికలకు వసతి గృహం నిర్మించాలని మంత్రిని కోరారు.
ఇదీ చూడండి. వైకాపా నేత కుమారుడిపై హత్యాయత్నం