ETV Bharat / state

MIRCHI: గుంటూరు మిర్చి రైతులకు నిరాశ.. దక్కని 'పంట బీమా' - గుంటూరు జిల్లా తాజా వార్తలు

MIRCHI: నల్లతామర పురుగు సోకడంతో తీవ్ర నష్టాల పాలైన మిర్చి రైతులకు.. పంటల బీమాలో నిరాశ ఎదురైంది. మిరప పంటకు వాతావరణ ఆధారిత పంటల బీమా అమలు చేయడంతో.. గుంటూరు జిల్లాలోని కొన్ని మండలాల రైతులు పరిహారానికి నోచుకోలేదు.

MIRCHI
గుంటూరు మిర్చి రైతులకు దక్కని 'పంట బీమా'
author img

By

Published : Jun 17, 2022, 11:28 AM IST

గుంటూరు మిర్చి రైతులకు దక్కని 'పంట బీమా'

MIRCHI: గుంటూరు జిల్లాలో గతేడాది 1.06 లక్షల హెక్టార్లలో రైతులు మిరప సాగు చేశారు. పూత సమయంలో నల్లతామర పురుగు సోకడంతో... రైతులకు తీవ్ర నష్టాలు వచ్చాయి. మిర్చి పంటకు సోకిన ఈ చీడపీడలపై పరిశోధన సంస్థలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఎకరాకు దాదాపు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టగా.. సుమారు 75 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు అధికార యంత్రాంగం నివేదికలు రూపొందించింది. నాయకులు, అధికారులు ఆదుకుంటామని హామీ ఇచ్చినా.. ఇటీవల విడుదల చేసిన పంటల బీమాలో మిర్చి రైతులకు పరిహారం అందలేదు. పెట్టుబడి కూడా చేతిరాకపోతే బతికేది ఎలాగని వట్టిచెరుకూరు, లేమల్లెపాడు మిర్చి రైతులు ప్రశ్నిస్తున్నారు.

వాతావరణ ఆధారిత పంట బీమా వంటి సాంకేతిక అంశాల్ని పక్కనపెట్టి.. నష్టపోయిన మిర్చి రైతులకు పరిహారం అందించాలని రైతుసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలో మొత్తం 25 వేల 236 మంది రైతులకు 37.94 కోట్ల రూపాయల పంటల బీమా డబ్బు విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వరి, కంది వంటి పంటలకు దిగుబడి ఆధారిత బీమా వర్తిస్తుండగా.. మిర్చి, పత్తికి మాత్రం వాతావరణ ఆధారిత బీమా అమలవుతోందని అంటున్నారు. అందువల్లే మిర్చి రైతులకు బీమా అందలేదన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.