ETV Bharat / state

విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు: జేసీ ప్రశాంతి - mangalagiri latest news

గుంటూరు జిల్లా మంగళగిరిలో అధికారులతో జాయింట్ కలెక్టర్ ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

guntur joint collector prashanthi
మంగళగిరిలో అధికారులతో జాయింట్ కలెక్టర్ ప్రశాంతి సమీక్ష
author img

By

Published : Apr 9, 2021, 7:44 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున జాయింట్ కలెక్టర్ ప్రశాంతి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని వార్డు సచివాలయాలలో వాక్సినేషన్ ప్రక్రియను స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం వార్డు సచివాలయ అడ్మిన్, నగర పాలక సంస్థల అధికారులతో సమావేశమయ్యారు.

కరోనా కేసులు తగ్గించేందుకు వార్డు సచివాలయాల అడ్మిన్​లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జేసీ సూచించారు. ఈనెల 11 నుంచి 14 వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని సూచించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళగిరి ఎయిమ్స్​లో తాగునీటి ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని జేసీ ప్రశాంతి అన్నారు.

ఇదీచదవండి.

'వకీల్​ సాబ్​' బెనిఫిట్​ షోను ఎందుకు రద్దు చేశారు: సునీల్ దేవ్​ధర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.