ఓటర్ల జాబితాలో బీసీలను, ఎస్సీలుగా, ఓసీలను బీసీలుగా చిత్రీకరించారని గుంటూరు జేఏసీ నేతలు ఆరోపించారు. నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి డివిజన్ల పునర్విభజన, కేటగిరీ వారి ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వం అభ్యంతరాలను కోరింది. దీనిపై అఖిలపక్ష ఐకాస నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ల లిస్ట్‌లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తక్షణమే తప్పులను సరిదిద్ది.. ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారుచేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, కోవెలమూడి రవీంద్ర, సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి పాల్గొన్నారు.
ఇవీ చూడండి... కృష్ణా, గుంటూరులో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఆందోళనలో ప్రజలు