ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకున్న ఓ వ్యక్తికి షాక్ తగిలింది. బుక్ చేసిన పది రోజులకు ఇసుక రాగా... అందులో సగానికి పైగా రాళ్లే ఉన్నాయి.
గుంటూరు జిల్లా వెంగళాయపాలెంకు చెందిన అల్లాభక్షు గత నెలలో ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారు. ఎట్టకేలకు నెలా పదిరోజులకు ఇసుక ఇంటికి వచ్చింది. రాత్రి సమయం కావటంతో అన్‌లోడ్ చేయించుకున్నారు. ఉదయం చూస్తే ఇసుకలో సగానికిపైగా రాళ్లే కనిపించాయి. దీనిని చూసి వినియోగదారు లబోదిబోమంటున్నారు. ఎంతో ఖర్చుపెట్టుకుని ఇసుకను తెప్పించుకుంటే ఇలా రాళ్లు ఎక్కువగా ఉండటం ఏమిటని వాపోతున్నారు.
ఇదీ చూడండి