గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆలయంలోకి భక్తుల రాక మొదలైంది. లాక్ డౌన్ కారణంగా గత 78 రోజుల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వలేదని ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ట్రయిల్ రన్ లో భాగంగా 8, 9వ తేదీల్లో స్థానికులకు మాత్రమే దైవ దర్శనం కల్పిస్తున్నామన్నారు.
10వ తేదీ నుంచి భక్తులు అందరికీ ఆలయ ప్రవేశం ఉంటుందన్నారు. అయితే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా 10 ఏళ్ల లోపు, 65 ఏళ్ల పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదని తెలిపారు. భక్తులకు థర్మల్ స్కానింగ్ నిర్వహించి.. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించి.. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: