గుంటూరు జిల్లాలో భూసేకరణకోసం వచ్చిన అధికారులకు రైతుల నుంచి చుక్కెదురైంది. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పేరిట అమరావతి మండలంలోని పలు గ్రామాల్లో భూసేకరణకు వచ్చిన అధికారులు.. రైతుల వ్యతిరేకత చూసి వెనక్కితగ్గారు. గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి అవసరమైన కాలువల నిర్మాణానికి భూమిని సేకరించాలని ధరణికోట, వైకుంఠపురం, లింగాపురం గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి... మార్కెట్ విలువ కంటే 1.6 రెట్లు అదనంగా పరిహారం ఇస్తామని అధికారులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా రైతులు వినలేదు. లింగాపురంలో సమావేశమైన రైతులు మరోసారి ప్రభుత్వానికి తమ అభ్యంతరాన్ని వెల్లడించారు. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని రైతులు గుర్తుచేశారు. ఇప్పడు తాము సైతం ఆ బాధలు పడాలా అంటూ రైతులు ప్రశ్నించారు.
ఇదీ చూడండి