గుంటూరు సర్వజన ఆసుపత్రిలో నూతనంగా విధుల్లో చేరిన వైద్యులకు కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ దిశానిర్దేశం చేశారు. కరోనాపై సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుదని.. అందులో భాగంగానే వైద్యుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. కరోనాపై పోరులో నిర్విరామంగా సర్వజన ఆసుపత్రి వైద్యులు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు 500 పడకలను త్వరితగతిన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఇదీ చూడండి