ETV Bharat / state

రేపు 2,466 మందికి వ్యాక్సినేషన్ - తొలిదశ కొవిడ్ టీకా పంపిణీకి గుంటూరులో ఏర్పాట్లు పూర్తి

రేపు జరగనున్న తొలిదశ కరోనా వ్యాక్సినేషన్​కు గుంటూరు జిల్లా అధికారులు పక్కాగా సిద్ధమయ్యారు. జిల్లాలోని 31 కేంద్రాలకు ఇప్పటికే టీకా తరలింపు పూర్తి చేశారు. మొదటిరోజున 2,466 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సంయుక్త కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. తొలిదశలో వైద్య సిబ్బందికి మాత్రమే టీకా ఇస్తామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి యాస్మిన్ స్పష్టం చేశారు.

guntur district ready for first phase covid vaccination
కరోనా వ్యాక్సినేషన్​కు గుంటూరు జిల్లా సిద్ధం
author img

By

Published : Jan 15, 2021, 8:32 PM IST

గుంటూరు జిల్లావ్యాప్తంగా 31 కేంద్రాల్లో కరోనా టీకా పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేంద్రంలో 50 నుంచి 80 మంది చొప్పున.. తొలిరోజున 2,466 మందికి వ్యాక్సిన్ అందించనున్నారు. 43,500 డోసులు ఇప్పటికే జిల్లాకు చేరుకోగా.. నిల్వ కేంద్రం నుంచి టీకా తరలింపు పూర్తైంది. డ్రై రన్ సమయంలో డమ్మీ పంపిణీ చేసిన విధంగా.. ఈసారి అసలు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి, చరవాణికి ఓటీపీ పంపించినట్లు అధికారులు తెలిపారు.

వారికి మాత్రమే...

వ్యాక్సినేషన్​లో పాల్గొనే వైద్య సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని సంయుక్త కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు.. టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారని చెప్పారు. వైద్య సిబ్బందికి తొలి దశలో టీకాలు అందించనున్నట్లు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి యాస్మిన్ తెలిపారు.

ఏర్పాట్లు ఇలా...

ఐదుగురు అధికారులు వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉంటారు. కో విన్ యాప్​లో టీకా పంపిణీ సమాచారాన్ని అప్ లోడ్ చేస్తారు. వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు రెండు కమిటీలు.. దాన్ని పర్యవేక్షించేందుకు, సందేహాలు నివృత్తి చేసేందుకు జిల్లా స్థాయిలో ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. టీకా పంపిణీ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వచ్చినా ఇబ్బంది కలగకుండా జనరేటర్ అందుబాటులో ఉంచారు.

ఇదీ చదవండి:

మరో ఐదుగురికి యూకే స్ట్రెయిన్ కరోనా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.