తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్న మద్యాన్ని గుంటూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విలువ 10 లక్షల రూపాయలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
గుంటూరు నల్లపాడు ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒక లారీని ఆపి పరిశీలించగా అందులో మద్యం బాటిళ్లను గుర్తించారు. లారీ డ్రైవర్, క్లీనర్ నుంచి సేకరించిన వివరాలతో పట్టాభిపురంలోని ఓ ప్రాంతలో సోదాలు నిర్వహించారు. అక్కడ భారీగా మద్యం బాటిళ్లను గుర్తించారు. ఘటనలో తెలంగాణకి చెందిన మొత్తం 4,800 మద్యం బాటిళ్లతో పాటు లారీ, స్విఫ్ట్ డిజైర్ కారు, ఆటో, మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశాం. ఈ కేసులో వినుకొండ మండలం శావల్యాపురానికి చెందిన ఓ పోలీసు అధికారి ప్రమేయం ఉంది. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరపరుస్తాం. అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం- అమ్మిరెడ్డి, గుంటూరు అర్బన్ ఎస్పీ
-
ఇదీ చదవండి: